Breaking News

పరకామణి చోరీ కేసులో సీఐడీ అదనపు నివేదిక


Published on: 10 Dec 2025 12:38  IST

తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో లోక్‌ అదాలత్‌ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను హైకోర్టులో దాఖ లు చేసింది. ఈ అదనపు నివేదిక మరో రెండు సెట్లను సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీ డీజీని హైకోర్టు ఆదేశించింది. చోరీ కేసు రాజీకి సంబంధించి లోక్‌ అదాలత్‌ అవార్డ్‌ చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ముందు, అంద జేయాలని రిజిస్ట్రీకి సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి