Breaking News

ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలు..!


Published on: 10 Dec 2025 16:51  IST

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని వారు ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ సీఎం రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు. 

Follow us on , &

ఇవీ చదవండి