Breaking News

భార్యపై కోపంతో అత్తగారి ఇంటికి నిప్పు


Published on: 17 Oct 2025 18:47  IST

అక్టోబర్ 17, 2025న భార్యపై కోపంతో అత్తగారి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ అనే గ్రామంలో జరిగింది.ముజాహిద్ అనే వ్యక్తి  తన భార్య షమాబీతో వివాహం ఇష్టం లేదని తరచుగా గొడవపడేవాడు. గత ఇరవై రోజుల నుండి గొడవలు ఎక్కువవడంతో షమాబీ పుట్టింటికి వెళ్లిపోయింది. అక్టోబర్ 17న, ముజాహిద్ మళ్లీ లింగాపూర్‌లోని అత్తగారింటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. తర్వాత కోపంతో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పంటించాడు. సిలిండెర్ పేలకపోవడం తో ప్రమాదం తప్పింది ఇల్లు కాలిపోయింది ఆస్తి నష్టం జరిగింది విషయం తెలుసుకున్న లింగాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి