Breaking News

3,600 అడుగుల జాతీయ పతాకం


Published on: 24 Jul 2025 14:29  IST

గిన్నిస్‌ బుక్‌లో రికార్డు సాధించే లక్ష్యంతో వాసవీక్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ రూపొందించిన అతిపెద్ద భారత జాతీయ పతాకాన్ని బుధవారం ఒంగోలులో ప్రదర్శించారు. 4వేల మంది విద్యార్థులు భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, ఎస్పీ ఏ.ఆర్‌.దామోదర్‌, మేయర్‌ గంగాడ సుజాత, వాసవి క్లబ్‌ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శిద్దా సూర్యప్రకాశరావు కార్యక్రమంలో పాల్గొన్నారు

Follow us on , &

ఇవీ చదవండి