Breaking News

డ్రోన్ ద్వారా మిసైల్‌ను ప్రయోగించిన డీఆర్‌డీఓ


Published on: 25 Jul 2025 11:25  IST

భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) మరో విజయాన్ని అందుకుంది. డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్‌-వీ3ని (యూఎల్‌పీజీఎమ్) విజయవంతంగా ప్రయోగించింది. కర్నూల్‌లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్‌‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో డీఆర్‌డీఓతో పాటు రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు పాల్గొన్నాయి.పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి