Breaking News

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా


Published on: 25 Jul 2025 11:48  IST

తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఒక వ్యక్తి రహదారిని అక్రమించి.. ప్రహారి గోడ నిర్మిస్తున్నట్లు సర్కిల్ 18లోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు ఫిర్యాదు అందింది.దీంతో సదర సర్కిల్‌ అధికారులు.. ఆ ప్రాంతానికి చేరుకుని.. ఆ స్థలం కొలతలు తీసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో వారిని స్థలం యజమాని అడ్డుకున్నారు. అంతేకాదు.. టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఆ వ్యక్తి వీరంగం చేశాడు. కారులో నుంచి కత్తీ తీసి నరికేస్తానంటూ సిబ్బందిని బెదిరించాడు. దీంతో వారు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. 

Follow us on , &

ఇవీ చదవండి