Breaking News

ఆశలు ఆవిరై.. గుండె ‘చెరువై’


Published on: 15 May 2025 14:57  IST

ఏటూరునాగారం, మే 14 అకాల వర్షానికి వరద ముంచెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి రైతులు ఘెల్లుమన్నారు. నడి వేసవిలో ఊరవాగు ఉప్పొంగి రెక్కల కష్టాన్ని ఒక్క ఉదుటున తుడిచిపెట్టేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి దాకా ధాన్యం కుప్పల వద్దే కాపలా ఉన్న రైతులు.. తెల్లవారుజామున కురిసిన వర్షానికి వడ్లు, బస్తాలు కొట్టుకుపోవడం చూసి అన్నదాత గుండె చెరువైంది.సుమారు 400 ఎకరాల్లో 30 మంది రైతులు సాగు చేసిన రెండు వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి