Breaking News

అమెరికా వస్తువులపై భారత్ సున్నా టారిఫ్..ట్రంప్


Published on: 15 May 2025 18:20  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గురించి సుంకాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. భారతదేశం అమెరికాకు జీరో టారిఫ్ ట్రేడ్ ఒప్పందాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. కానీ ఈ విషయంలో భారతదేశం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ట్రంప్ మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో ఖతార్ రాజధాని దోహాలో వ్యాపారవేత్తల ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలో భారతదేశంలో ఏదైనా అమ్మడం చాలా కష్టమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి