Breaking News

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు…


Published on: 16 May 2025 18:32  IST

థియేటర్లకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్లను కేవలం షేర్ ఆధారిత వ్యవస్థ ద్వారా నడపాలని లేదా పర్సంటేజ్ పద్ధతుల ఆధారంగా నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారని కొన్ని న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని, ఇటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని టీఎస్‌ఎఫ్‌సీసీ స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి