Breaking News

ఆ నటితో విశాల్‌ వివాహం ఫిక్స్‌.. పెళ్లి డేట్‌ ఇదే..


Published on: 20 May 2025 12:02  IST

హీరో విశాల్‌ సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి పెళ్లి అంశం సోషల్‌ మీడియాలోనూ హాట్‌టాపిక్‌ అయింది. తాజాగా ఈ అంశంపై వారిద్దరూ స్పందించారు. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్‌లో విశాల్‌, సాయి ధన్సిక తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. పెళ్లి తేదీని సైతం వెల్లడించారు. తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 29న విశాల్‌ పుట్టిన రోజు కావడం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి