Breaking News

కలియుగంలో ఇలా అయితేనే రాజకీయాలు చేయగలం..


Published on: 20 May 2025 17:22  IST

కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదని, అలా అయితేనే రాజకీయాలు చేయగలమని చెప్పారు. వివిధ స్థానిక సంస్థల ప్రతినిధులతో జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆయన తీరు ఇలాగే ఉందని చెప్పారు. తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి ప్రయత్నంచేస్తోందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి