Breaking News

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..


Published on: 20 May 2025 17:37  IST

టీటీడీ పాలకమండలి ఇవాళ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు. స్విమ్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలందించాలని, పలు విభాగాలకు సంబంధించిన 597 పోస్టులు భర్తీ చేయాలని, టీటీడీలోని 29 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వీఆర్ఎస్‌కు అంగీకరిస్తే రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి