Breaking News

ఇండియా బుల్లెట్ ట్రైన్ పనుల్లో కీలక ఘట్టం..


Published on: 20 May 2025 17:59  IST

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లే 300 కిలోమీటర్ల వయాడక్ట్ (రైల్వే వంతెన) పనులు పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ‘ఎక్స్’ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. మొత్తం 12 స్టేషన్లతో కూడిన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం లక్షా 8 వేల కోట్లు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి పనులు 2028కి పూర్తవుతాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్‌‌ నిర్మిస్తున్నారు. దీనిపై ట్రైన్‌‌ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి