Breaking News

ఐపీఎల్ 2025: ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు ఖరారు..


Published on: 20 May 2025 18:15  IST

ఐపీఎల్ (IPL) 2025 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. ముల్లాన్‌పుర్, అహ్మదాబాద్‌లో నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముల్లాన్‌పుర్‌ ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్ 2 (జూన్ 1), ఫైనల్ (జూన్ 3) అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ టైటాన్స్, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి