Breaking News

ఢిల్లీలో వడగళ్ల వాన భీభత్సం.. జన జీవనం అస్తవ్యస్తం..


Published on: 22 May 2025 12:13  IST

ఢిల్లీలో వడగళ్లతో కుంభవృష్టి కురిసింది. ముందుగా రెడ్‌ అలర్ట్ జారీ చేసినట్లుగా వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడటంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సఫ్దర్‌గంజ్ ఏరియాలో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, సెంట్రల్ ఢిల్లీ, గోల్ మార్కెట్, లోడి రోడ్‌లో కూడా వడగండ్లు పడ్డాయి.మెట్రో ట్రాక్‌పై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి