Breaking News

మలేషియా జైల్లో తెలంగాణ బిడ్డ‌లు..కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి


Published on: 22 May 2025 14:33  IST

దేశంకాని దేశానికి పోయి.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలై తెలంగాణ బిడ్డలు మలేషియా జైలు నుంచి విడుదలై స్వరాష్ర్టానికి చేరుకున్న బాధితులు బుధవారం నందినగర్‌లో కేటీఆర్‌ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. కంటి నుంచి రాలుతున్న నీటిచెమ్మను తుడుచుకుంటూ పుట్టిన గడ్డను, తమ పిల్లలను చూస్తామని కలలో కూడా అనుకోలేదని భావోద్వేగానికి లోనయ్యారు. కేటీఆర్‌కు, జాన్సన్‌నాయక్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి