Breaking News

దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం..


Published on: 22 May 2025 15:04  IST

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో 1,300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లను కేంద్రం ఏకకాలంలో పునరాభివృద్ధి చేస్తోందన్నారు. ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 5,337 కోట్లు కేంద్రం కేటాయించింది. అలాగే కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని ప్రధానమంత్రి మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ స్టేషన్‌ను ఈ సంవత్సరం దసరా సందర్భంగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు అంకితం చేస్తామన్నారు కిషన్ రెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి