Breaking News

పాక్‌తో సంధి విషయంలో యూఎస్‌ పాత్రపై జైశంకర్‌ క్లారిటీ


Published on: 22 May 2025 15:09  IST

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు. మే 10న జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. రెండు దేశాల ప్రతినిధులు హాట్‌లైన్‌ ద్వారా చర్చించినట్లు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి