Breaking News

‘మూడు నెలల రేషన్‌’కు గడువు కోరిన తెలంగాణ రాష్ట్రం


Published on: 22 May 2025 15:33  IST

వర్షాకాలానికి ముందే మూడు నెలలకు సరిపడా రేషన్‌ బియ్యం నిల్వలను పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికిప్పుడు సమకూర్చలేమని, మరో నెల రోజుల గడువు కావాలని కేంద్రానికి లేఖ రాసింది. జూన్‌ ఆఖరుకు సమకూరుస్తామని లేఖలో పేర్కొంది.జూన్‌ నుంచి వానాకాలం మొదలవుతుందని, వరదలు, వాగులు, వంకలు పొంగటం వంటి సమస్యలు ఎదురైతే. పేద ప్రజలకు ఆహారధాన్యాలు చేరవేయడం ఇబ్బందిగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి