Breaking News

పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు


Published on: 22 May 2025 18:23  IST

పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జై శంకర్‌ తాజాగా స్పందించారు. ఈ దాడి కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీసే, మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే లక్ష్యంతో జరిగిన ‘అనాగరిక’ చర్యగా అభివర్ణించారు. డెన్మా‍ర్క్‌, నెదర్లాండ్స్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాకిస్థాన్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ పై సంచలన ఆరోపణలు చేశారు. మునీర్‌ తీవ్రమైన మతపరమైన దృక్పథంతో నడిచే వ్యక్తి అని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి