Breaking News

పరువు తీసుకుంటున్న పాకిస్థాన్


Published on: 26 May 2025 14:35  IST

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య చోటు చేసుకున్న పరిణామాల్లో భారత్‌‌ పైచేయి సాధించింది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్‌పై విజయం సాధించినట్లు భావిస్తోంది. ఆపరేషన్ బున్యన్‌లో పాకిస్థాన్ ఘన విజయాన్ని అందుకుంది. అందుకు ప్రతీకగా పాక్ ప్రధాని షరీఫ్‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మున్నీర్‌‌ ఓ ఫోటోను బహుమతిగా ఇస్తున్నట్లు ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ క్రమంలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి