Breaking News

కెనడాకు గోల్డెన్‌ డోమ్‌ ఫ్రీ: ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు


Published on: 28 May 2025 11:59  IST

భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్‌ డోమ్‌’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబర్చింది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. మరోసారి విలీన డిమాండ్‌ను లేవనెత్తారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే.. గోల్డెన్‌ డోమ్‌ను ఉచితంగా పొందొచ్చని వ్యాఖ్యానించారు. లేదంటే 61 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి