Breaking News

ఓలాకు మరో ఎదురుదెబ్బ..


Published on: 28 May 2025 14:19  IST

దేశీయ విద్యుత్‌ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఒకప్పుడు టాప్‌లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ క్రమంగా తన స్థానాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రత్యర్థి కంపెనీలైన టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో విక్రయాలు జోరందుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మేలో మూడో స్థానానికి పడిపోయింది. దీంతో ఇప్పటికే నియంత్రణ సంస్థల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 22.1 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా మే నాటికి 20 శాతానికి పడిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి