Breaking News

ప్రభుత్వ బడులను బలోపేతం చేయండి


Published on: 28 May 2025 15:02  IST

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, సభ్యులతో పాటు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యోగితారాణా, ఇతర అఽధికారులతో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి సీఎం రేవంత్‌కు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి