Breaking News

రాజ్యసభ సభ్యుడిగా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం


Published on: 28 May 2025 16:09  IST

రాజ్యసభ సభ్యుడిగా పాక వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం సత్యనారాయణ చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, ఎంపీ లక్ష్మణ్, ఏపీ మంత్రి సత్య కుమార్ హాజరయ్యారు. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ స్థానానికి పాక సత్యనారాయణ అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి