Breaking News

44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే


Published on: 29 May 2025 18:31  IST

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్‌ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించినట్లు వివరించింది. విశాఖపట్నం – బెంగళూరు (08581) మధ్య జూన్‌ ఒకటి నుంచి 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఇక బెంగళూరు-విశాఖపట్నం (08582) మధ్య జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి