Breaking News

బీజేపీ చర్యను స్వాగతించిన కాంగ్రెస్ ఎంపీ


Published on: 30 May 2025 11:26  IST

జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ స్వాగతించారు. ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తుందన్నారు. తద్వారా దేశంలోనే ఆ రాష్ట్రం ఉన్నా.. మిగిలిన ప్రాంతాలతో వేరుగా ఉన్నట్లు ఒక భావన అయితే తమకు ఉండేదన్నారు. కానీ ఈ ఆర్టికల్ రద్దుతో ఆ భావన తమలో పూర్తిగా పోయిందని తెలిపారు. ఈ ఆర్టికల్ రద్దు అనంతరం ఆ రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి