Breaking News

ఆపరేషన్ కగార్‌లో పోలీసుల ప్రతిభ..


Published on: 30 May 2025 14:08  IST

పోలీస్ సిబ్బందికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మావోయిస్టుల అణచివేతలో సమర్థవంతంగా పని చేసిన పోలీసులకు పదోన్నతలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 295 మందికి ఆ రాష్ట్ర పోలీస్ శాఖ పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన పదోన్నతులు జాబితాను ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ గౌతమ్ శుక్రవారం రాయ్‌పూర్‌లో విడుదల చేశారు. రిజర్వ్ ఫోర్స్ నుంచి డీఎస్పీ వరకు అన్ని విభాగాల అధికారులకూ ఈ పదోన్నతలు కల్పించినట్లు జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి