Breaking News

ఆధిపత్యం కోసం చైనా ఎత్తుగడ..


Published on: 02 Jun 2025 12:30  IST

చైనా తన దుష్ట బుద్ధి మార్చుకోవటం లేదు. అనవసరంగా భారతదేశాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన మిత్ర దేశం పాకిస్తాన్‌తో కలిసి కొత్త కొత్త కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఓ కొత్త సంస్థకు రూపకల్పన చేసింది. ఇంటర్ నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్(IOMed)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా దక్షిణ ఆసియా దేశాలపై ఆధిపత్యం సాధించడానికి చూస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంపై చైనా పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఇప్పుడు మిగిలిన దేశాలపై పట్టు సాధించడానికి చూస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి