Breaking News

శర్మిష్ఠ పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్‌కతా హైకోర్టు


Published on: 03 Jun 2025 16:27  IST

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడియో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలి (Sharmistha Panoli)కి కోల్‌కతా హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు మంగళవారం నాడు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకూ ఒక పరిమితి ఉంటుందని.. వ్యక్తులు, మతపరమైన భావోద్వేగాలను గాయపరచ రాదని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి