Breaking News

త్వరలోనే జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం..


Published on: 10 Jun 2025 12:07  IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్​తెలిపారు. సోమవారం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కార్యాలయ ప్రారంభోత్సవ అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​మాట్లాడుతూ.. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి