Breaking News

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..


Published on: 12 Jun 2025 12:29  IST

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చందానగర్‌ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునిగాయి. వేముకుంటలోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సరైన డ్రైనేజీ వ్యవస్థ, వరద నీరు వెళ్లేందుకు కాలువలు లేకపోవడం వల్లే ఇలా ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి