Breaking News

స్టార్ హీరోయిన్ మాజీ భ‌ర్త క‌న్నుమూత‌!


Published on: 13 Jun 2025 15:21  IST

ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ (53) గురువారం (జూన్‌ 12) హఠాన్మరణం చెందారు. ఇంగ్లాండ్‌లో ఉన్న ఆయన గ్రౌండ్‌లో పోలో మ్యాచ్ ఆడుతూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. సంజ‌య్ పోలో ఆటాడుతున్న స‌మ‌యంలో తేనెటీగ పొరబాటున నోట్లోకి ప్రవేశించింది. దీంతో ఆయనకు తెలియకుండానే దానిని మింగేశారు. దీంతో తీవ్రమైన రియాక్షన్‌ వచ్చి ఊపిరాడక గుండెపోటుకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు.

Follow us on , &

ఇవీ చదవండి