Breaking News

పఠాన్‌కోట్‌లో ఆర్మీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌..


Published on: 13 Jun 2025 15:40  IST

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో ఆర్మీ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడం తీవ్ర కలకలం రేపింది. పఠాన్‌కోట్ జిల్లాలోని నంగల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే హాలెడ్ గ్రామంలో శుక్రవారం ఉదయం భారత వైమానిక దళానికి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి