Breaking News

అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్‌ క్షిపణి..!


Published on: 16 Jun 2025 14:13  IST

ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి టెల్‌అవీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకొంది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్‌ హకేబీ ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. టెల్‌ అవీవ్‌, జెరూసలెంలోని కార్యాలయాలు మూసే ఉంటాయని ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి