Breaking News

అమెరికాలో కాల్పులు..చిన్నారి సహా ముగ్గురు మృతి


Published on: 16 Jun 2025 16:56  IST

ఆదివారం రాత్రి ‘సెంటెనియల్‌ పార్క్‌లో జరుగుతున్న వెస్ట్‌ఫెస్ట్‌లో కాల్పులు జరిగాయి’ అని పోలీసులు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ఘటనలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి