Breaking News

ఇరాన్ మిస్సైల్ దాడిలో..ఇజ్రాయిలీ ఆస్ప‌త్రి ధ్వంసం


Published on: 19 Jun 2025 15:13  IST

ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేసింది. గురువారం తెల్ల‌వారుజామున‌ మిస్సైళ్ల‌తో అటాక్ చేసింది. అయితే ఆ దాడి వ‌ల్ల ద‌క్షిణ ఇజ్రాయిల్‌లోని ప్ర‌ధాన ఆస్ప‌త్రి ధ్వంస‌మైంది. బీర్‌షెబాలోని సోరోకా ఆస్ప‌త్రి ఆ దాడిలో దెబ్బ‌తిన్న‌ది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న అనేక మంది గాయ‌ప‌డ్డారు. డ్యామేజ్ చాలా విస్తృత స్థాయిలో జ‌రిగిన‌ట్లు ఇజ్రాయిలీ మంత్రి పేర్కొన్నారు.సోరోకా ఆస్ప‌త్రి నుంచి ద‌ట్ట‌మైన పొగ వ‌స్తున్న విజువ‌ల్స్ రిలీజ్ చేశారు. ఆ ఆస్ప‌త్రి కిటికీలు ధ్వంసం అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి