Breaking News

మా ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవు


Published on: 19 Jun 2025 15:30  IST

జగన్ పాలనలో తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవిస్తారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తప్పు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు అధికారం తమకు ఇచ్చింది జగన్, ప్రతిపక్ష నేతలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి కాదని స్పష్టం చేశారు. చట్టప్రకారం అందరికీ శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి