Breaking News

టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఇష్యూ..నిలిచిన విమానం


Published on: 20 Jun 2025 14:20  IST

బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. 3జీ 329 థాయ్ ఎయిర్‌లైన్స్‌ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సమస్య తలెత్తడంతో బ్యాంకాక్‌లోనే విమానాన్ని నిలిపివేశారు. విమానం నుంచి ప్రయాణికులను దింపివేశారు. ప్రస్తుతం ప్రయాణికులు బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. టెక్నికల్ ఎర్రర్ ఉండటం వల్లే విమానం ఆలస్యంగా బయలుదేరుతుందని ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి