Breaking News

యూఎస్‌లో ఆందోళనలు.. పలు నగరాల్లో హై అలర్ట్


Published on: 23 Jun 2025 12:27  IST

ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచి.. ఇరాన్‌లోని కీలక అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం పట్ల సోమవారం యూఎస్‌లోని బోస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్ తదితర నగరాల్లో ప్రజలు రహదారులపైకి స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ యుద్దంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇవ్వవద్దని వారు ప్లకార్డులు చేత పట్టి బిగ్గరగా నినాదాలు చేశారు.ప్రజలు ఆందోళనలకు దిగడంతో పలు నగరాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి