Breaking News

జగన్నాథ రథ యాత్రలో అపశృతి..


Published on: 27 Jun 2025 11:23  IST

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి