Breaking News

అధ్యక్షుడిగా పనిచేయడం ఆషామాషీ కాదు.. ట్రంప్


Published on: 28 Jun 2025 11:34  IST

అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్‌ గుర్తుచేసుకున్నారు. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనదని, ఎన్నో సవాళ్లతో కూడుకొనిఉంటుందని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి