Breaking News

కార్తీక్ మహారాజ్ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు..


Published on: 28 Jun 2025 14:12  IST

పద్మ శ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కార్తీక్ మహారాజ్‌గా ప్రసిద్ధి చెందిన స్వామి ప్రదీప్తానంద తనపై పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. తనకు పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2013 నుంచి పలుమార్లు తనపై కార్తీక్ మహారాజ్ అత్యాచారం చేశాడని వెల్లడించింది. ఈ ఏడాది కేంద్రం బహూకరించిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో మహారాజ్ ఒకరు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి