Breaking News

రైతు కుటుంబాలకు ‘అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌’


Published on: 28 Jun 2025 14:25  IST

ఏపీ లో ‘అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్‌’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించామని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98% మందికి ఈకేవైసీ పూర్తయిందన్నారు. ఇంకా 61వేల మందికి పూర్తి చేయాల్సి ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. సొంతభూమి కలిగిన డి.పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని ఢిల్లీరావు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి