Breaking News

అమెరికాలో అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు..ఇద్దరు మృతి


Published on: 30 Jun 2025 12:27  IST

అమెరికా స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కూటేనై కౌంటీలోని పర్వత ప్రాంతంలో ఉన్న పార్క్‌లో మంటలు అంటుకున్నట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వారు మంటలు ఆర్పుతున్న సమయంలో ఓ దుండగుడు శక్తిమంతమైన రైఫిల్స్‌తో సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అప్రమత్తమయ్యేలోపు వారిలోని ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి