Breaking News

ఉత్తరాదిని ముంచెత్తిన వానలు


Published on: 30 Jun 2025 12:46  IST

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్‌ బైండ్‌లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారు. ఏడుగురి ఆచూకీ గల్లంతైంది. ఘటనాస్థలానికి 18 కిలోమీటర్లల దూరంలోని తిలాడీ షాహిద్‌ స్మారక్‌ వద్ద ఆ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలంలో ఉన్న 29 మంది లో 20 మందిని రక్షించామని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి