Breaking News

కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. రవడ చంద్రశేఖర్


Published on: 30 Jun 2025 13:04  IST

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్, కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్ (డీజీపీ)గా నియమితులయ్యారు. ఆయన జూన్ 30, 2025న రిటైర్ కానున్న షేక్ దర్వేష్ సాహెబ్ స్థానంలో ఈ పదవిని చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రవడ చంద్రశేఖర్‌ను డీజీపీగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల జరిగిన వర్చువల్ సమావేశంలో సీఎం నేతృత్వంలో జరిగిన కేరళ కేబినెట్‌ ఆమోదించింది.

Follow us on , &

ఇవీ చదవండి