Breaking News

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు..


Published on: 01 Jul 2025 14:55  IST

బంగారం ధరలు కాస్త ఊరటనిచ్చినట్టే ఇచ్చి.. అమాంతం మళ్లీ పెరిగాయి.. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు దాదాపు రూ.5వేల వరకు దిగివచ్చాయి.. అయితే.. ఈ క్రమంలోనే బంగారం ధర మళ్లీ భారీగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. తాజాగా.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. పది గ్రాముల బంగారం పై ఏకంగా రూ.1,140 మేర ధర పెరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి