Breaking News

డీకే శివకుమార్‌కు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు..


Published on: 01 Jul 2025 15:50  IST

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై డీకే శివకుమార్‌, సీఎం సిద్ధరామయ్య ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు ఉంటారని సమాచారం. ఈ క్రమంలో అక్టోబర్‌లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు కాంగ్రెస్‌ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకేకి సన్నిహితుడిగా పేరొందిన ఓ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ‘మార్పు’ కోరుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి