Breaking News

చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్


Published on: 03 Jul 2025 13:35  IST

బౌద్ధ మత గురువు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై చేసిన ప్రకటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో బీజింగ్ కోపం కట్టలు తెంచుకుంది. తమ ఆమోదముద్ర లేకుండా దలైలామ వారసుడిని ఎంపిక చేయకూడదని తెలిపింది. ఈ అంశంపై భారత్ స్పందించింది. దలైలామా పునర్జన్మను బీజింగ్ ఆమోదించాలని చైనా చేసిన డిమాండ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి తప్ప మరెవరికీ తన వారసుడిని నిర్ణయించే అధికారం లేదని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి